పిరమిడ్ న్యూస్‌ (03-12-2018)బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో IFSS మహాసమ్మేళన్ రెండు రోజుల కార్యక్రమాలు ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమంలో పలువురు స్పిరిచ్యువల్ సైన్టిస్టులతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎందరో ధ్యానులు పాల్గొన్నారు. ఈ మహాసమ్మేళన్ లో ప్రదర్శించిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్కక్రమాలు ఆహుతులను మైమరపింప చేసాయి , అంతేకాకుండా పలువురు తమతమ ధ్యానునుభవలను ఈ వేదిక పై పంచుకున్నారు.


బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో IFSS మహాసమ్మేళన్ రెండు రోజుల కార్యక్రమాలు ఘనంగా ముగిసాయి.  ఈ కార్యక్రమంలో పలువురు స్పిరిచ్యువల్ సైన్టిస్టులతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎందరో ధ్యానులు పాల్గొన్నారు. ఈ మహాసమ్మేళన్ లో ప్రదర్శించిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్కక్రమాలు ఆహుతులను మైమరపింప చేసాయి , అంతేకాకుండా పలువురు తమతమ ధ్యానునుభవలను ఈ వేదిక పై పంచుకున్నారు. 

ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహిస్తున్న 41 రోజులు ధ్యాన శిక్షణా తరగతులలో భాగంగా 31వ రోజు ఆదివారం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డైరక్టర్ సి. ఆనందకుమార్ AWEAKING INNER POTENTIAL అనే అంశంపై తన ధ్యాన సందేశాన్నిచ్చారు.

కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ పిరమిడ్ ప్రాంగణంలో బ్రహ్మర్షి పితామహ పత్రీజీ పర్యవేక్షలో కార్తీక వనభోజనాలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో ముందుగా స్వచ్చకైలాసపురి కార్యక్రమాన్ని నిర్వహించి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు , ఈ స్వచ్చకైలాసపురి కార్యక్రమంలో బ్రహ్మర్షి పితామహ పత్రీజీ కూడా పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు , తదనంతరం కదంవనంలో కార్తీక వనసామారాధన , ధ్యానం నిర్వహించారు.

బళ్లారిలోని సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో యోగ - ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేకమంది ధ్యానులు ప్రాణాయామం ద్వార బౌతిక శరీరానికి కావలసిన శక్తిని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుని , అభ్యసించారు. 

కల్వకుర్తి పట్టణంలో ధ్యాన శిక్షణ - ఆత్మ జ్ఞాన భోద శిక్షణా తరగతులు నిర్వహించారు . స్థానిక శ్రీనివాస హెవీ మోటర్ డ్రైవింగ్ స్కూల్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కి చెందిన పిరిమిడ్ మాస్టర్ శ్రీకాంత్ హాజరై ఆరోగ్యం , ఆనందం , ప్రశాంతత , ఆత్మజ్ఞానం కొరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని తెలియజేసారు . ఈ కార్యక్రమంలో పలువురు బాలబాలికలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో పూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మైత్రేయ బుద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు - దశావతారాలు పై అనంతపురం గోరింట్ల సూర్యనారాయణ స్వామి ఆధ్యాత్మిక సందేశానిచ్చారు , భగవద్గీత భోదనాగ్రంథం కాదు అది ఒక అక్షర రూపంలో ఉన్న మహాచైతన్యమని చెబుతూ , ప్రాపంచిక జీవితంలో ఎదగడానికి ఆలోచన చేయాలి , ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఆలోచనను త్యజించాలని తన సందేశంలో తెలిపారు. 

హ్యాపీ సండేలో భాగంగా ఈ ఆదివారం విజయవాడలోని మానస సరోవరంలో ధ్యాన తరగతులు నిర్హించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీమతి లక్ష్మి , మరి రాజ్యలక్ష్మి , రామాంజనేయరెడ్డి  దంపతులు తమ ధ్యానానుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ధ్యానులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా పుత్తూరు PSSM ఆధ్వర్యంలో శ్రీసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పలమనేరుకు చెందిన బాలాజీ చే  శ్రీ భగవద్గీతా ధ్యాన యోగం అనే అంశం పై జ్ఞాన సందేశం అందించబడింది .  ఉదయం 10 గంటకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధ్యానులంతా భగవద్గీతలోని ధ్యాన యోగ రహస్యాలను తెలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు .

చిత్తూరు జిల్లా రేణుగంట PSSM వారు స్థానికంగా ఉన్న కన్నయతాత పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కార్తీకమాస వనసమారాధన ను నిర్వహికున్నారు . పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ వనసమారాధనలో నిర్వహించిన ప్రత్యేక ధాన శిక్షణా తరగతిలో  తిరుపతికి చెందిన డాక్టర్ ప్రతాప్ తన ఆత్మజ్ఞాన సందేశానిచ్చారు. 

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలోని శ్రీ కృష్ణకిషోర్ ధ్యాన మందిరం వ్యవస్థాపకులు గుండా అనపూర్ణ , శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణా తరగతి నిర్వహించబడింది . ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మర్లెంపూడికి చెందిన A. తులసి తన ఆత్మ జ్ఞాన సందేశానిచ్చారు. ఈ కార్య్

గద్వాల జోగులాంబ జిల్లాలోని అల్లంపూర్ నియోజక వర్గంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రచారం విస్త్రుతంగా జరిగింది . స్థానిక ppoi పార్టీ ప్రతినిథి ప్రసంగి తో కలిసి సైదయ్య , సుమిత్రమ్మ , నందిని, లక్ష్మిలతో పాటు పలువరు ధ్యానులు పాల్గొని ఎన్నికల ప్రచారంతో పాటు శాకాహార , ధ్యాన ప్రచార కరపత్రాలను పంచారు. 

మహేశ్వరం నియోజకవర్గ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి సి. పద్మ తన నియోజకవర్గ పరిథిలోని రామకృష్ణాపురం , అలకాపురి , SBI కాలనీ లలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక పిరమిడ్ మాస్టర్లు పాల్గొని విస్తృతంగా ధ్యాన , శాకాహార ప్రచారాన్ని నిర్వహించారు . ఆత్మజ్ఞానులు , శాకాహారులను మాత్రమే ఎన్నోవాలని ఓటర్లను అభ్యర్థించారు.

అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో పెదగంట్యాడలోని ఉక్కు నిర్వాసిత గ్రామలలో శాకాహరంపై అవగాహనర్యాలీ నిర్వహించారు . ఈ ర్యాలీని గాజువాక వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పల చినఅప్పారావు ప్రారంభించి తన సందేశానిచ్చారు.

బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఆదేశానుసారం.. విశాఖపట్నం జిల్లా అరుకు లోయ లో ఉన్న ప్రకృతి వ్యాలీలో జనవరి 17 నుంచి కు 23 వరకు నిర్వహించబోతున్న  మహా కరుణ ధ్యాన మహాచక్రం వన్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.!!

మహా కరుణ ధ్యాన మహాచక్రం మన్యసీమ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడానికి కార్యనిర్వాహక వర్గం నిర్ణయం తీసుకుంది..!!

ముఖ్యంగా భద్రాచలం, రంపచోడవరం, పాడేరు, అరకు,నర్సీపట్నం, పార్వతీపురం బొబ్బిలి, సాలూరు, మక్కువ, హిరమండలం సీతమ్మ పేట మహేంద్రగిరి వరకు ఉన్నటువంటి మన్య ప్రాంతాలలో ధ్యాన ప్రచారం.. అహింసా ప్రచారం సద్భావన ర్యాలీలు ముఖ్యంగా సంతలలో విస్తృతంగా ప్రచారం చేయడానికి మరి ఆ ప్రాంతాలలో పెద్ద హోర్డింగ్స్ పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది .!!

అలాగే విశాఖ సీనియర్ మాస్టర్ వల్లయ్య  గారి పర్యవేక్షణలో అరుకు మరి గిరిజన ప్రాంతాలలో గ్రామ గ్రామాన విస్తారంగా ప్రచారానికి .. ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది!!

ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్లీ కలుసుకుందాం...