పిరమిడ్ న్యూస్ (04-12-2018)బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో IFSS మహాసమ్మేళన్ ఘనంగా ప్రారంభమైంది . రెండురోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పలువురు స్పిరిచ్యువల్ సైన్టిస్టులతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎందరో ధ్యానులు పాల్గొన్నారు.


బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో IFSS మహాసమ్మేళన్ ఘనంగా ప్రారంభమైంది .  రెండురోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పలువురు స్పిరిచ్యువల్ సైన్టిస్టులతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎందరో ధ్యానులు పాల్గొన్నారు. 

బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్రతీరంలో శుక్రవారం కార్తీకమాస ధ్యాన సమారాధన అధ్బుతంగా జరిగింది. దాదాపు 500 మంది ధ్యానులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కడ్తాల్ కైలాస్‌పురి చెందిన రాజశేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొని కార్తీకమాస ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేసారు , అంతేకాకుండా డోన్ కి చెందిన పద్మావతి , రామాంజనేయుల ఆత్మజ్ఞాన గీతాలాపన లతో పాటు అనన్య, దివ్యల  కూచిపూడి నృత్యం ఆహుతులను అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన ఈ కార్యక్రమంలో వెలగపూడి లక్ష్మణరావు , రామిరెడ్డిలు తమ ధ్యాన సందేశాలతో పాటు వచ్చిన వారందరితో పాటు ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు.

ఈ నెల 7 వ తేదీన జరగబోతున్న తెలంగాణా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటరులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా సాగుతున్న పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ప్రజలను ఎంతాగనో ప్రభావితం చేస్తోంది. శాకాహారులు , ఆత్మజ్ఞానులు మాత్రమే సుపరిపాలను అందించగలరు అన్ని చెప్పిన ఎందరో ఆధ్యాత్మికవేత్తల ఆకాంక్షలకు అనుగుణంగా పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని ఈ ఎన్నికలలో పోటీ  చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు వివరిస్తూ వారి మద్దతును పొందుతున్నారు. 

ఒరిస్సాలో దిగ్విజయంగా ముందకు సాగిపోతున్న యాత్రాఫర్ యానిమల్స్ ర్యాలీ .. ఒరిస్సా రాష్ట్ర పజలు , స్థానికంగా ఉన్న పలువురు ఆధ్యాత్మిక సంఘాల సహాయసహకారాలతో శుక్రవారం సాయంత్రానికి జైపూర్ జిల్లాలో తమ ర్యాలీని పూర్తి చేసుకుని , ప్రస్తుతం దెన్ కెనాల్ జిల్లాలో కొనసాగుతోంది. మహాకరుణ లక్ష్యం దిశగా సాగుతన్న ఈ ర్యాలీకి పలువరు జంతుప్రేమికులు తమ మద్దతును తెలియజేసారు.

ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు మరిన్ని పిరమిడ్ సొసైటీ వార్తలతో మళ్లీ కలుసుకుందాం....